బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ను విరమించుకోవాలి

Published: Wednesday December 08, 2021
ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులునల్లా నాగేంద్ర ప్రసాద్
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 07, ప్రజాపాలన : బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ను  కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులునల్లా నాగేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణలో భాగంగా తెలంగాణలోని 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించిందని అన్నారు. వెంటనే ప్రైవేటీకరణను విరమించుకుని, సింగరేణి పరిధిలోని బోగ్గు బ్లాకులను అప్పగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈనెల 9, 10, 11, తేదీలలో సింగరేణి కార్మిక సంఘాలు 12 డిమాండ్లతో 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమ్మెకు ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది ఆని అన్నారు. సింగరేణి కార్మికులు అందరూ రైతులను స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంపై పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల రమేష్ - ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, పల్లికొండ సంజయ్ - ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ వింగ్ నాయకులు నాయకులు ఎలువక శ్రీనివాస్, దరిపెల్లి తరుణ్, బెజ్జంకి వినయ్, మదాసు నరేష్ తదితరులు పాల్గొన్నారు.