పేదవాడికి అండగా సీఎం కేసీఆర్ ....అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ....... అశ్వాపురం( ప్రజా ప

Published: Friday December 30, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామ పంచాయతీ భీమవరం గ్రామంలో పాయం అర్జయ్య  కి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన 24,000/_  రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్వయంగా వారి స్వగృహమునకు వెళ్లి లబ్ధిదారుడికి అందజేసిన...అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఈ సందర్భంగా జడ్పిటిసి  సూదిరెడ్డి సులక్షణ & కోడి అమరేందర్ యాదవ్  మాట్లాడుతూ.నిరుపేదల ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్  అని వారు   అన్నారు
ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు, ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఆదుకునేందుకు సీఎం కేసీఆర్  మానస పుత్రిక అయినటువంటి కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ తో పాటు రైతు బంధు , దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాలతో దేశంలోనే నవ శకానికి నాంది పలికిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్  అన్నారు, అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమలు నిర్వహిస్తున్న
నిరుపేద కుటుంబాల వైద్య ఖర్చులు నిమిత్తం అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నగదు మంజూరు చేసి భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,తుమ్మలచెరువు సర్పంచ్ బండ్ల సంధ్యారాణి,సీనియర్ మండల నాయకులు , బిఆర్ఎస్  పార్టీ సీనియర్ నాయకులు సూది రెడ్డి గోపిరెడ్డి ,చిలకా వెంకటరామయ్య,కంసాని సత్యనారాయణ,ముత్యాల నరసింహారావు,బండ్ల కాంతారావు,ఈసంపల్లి పున్నారావు,గ్రామ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.