సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచి

Published: Tuesday August 30, 2022

వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ స్థాయి నుండి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్లు, నివాస ప్రాంతాలు, రోడ్లపై నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మురుగు కాలువలలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించే విధంగా గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి రోజు ఇంటింటి నుండి తడి, పొడి చెత్తలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు. గ్రామాలలో అంటువ్యాధులు వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉ ండాలని తెలిపారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపట్టిన క్రీడా ప్రాంగాణాల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని మండలానికి రెండు క్రీడా ప్రాంగాణాల చొప్పున కేటాయించడం జరిగిందని, సంబంధిత పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లాలో గత సంవత్సరం లక్ష్యాలను అధిగమించడం జరిగిందని, 2022-23 సంవత్సరానికి గాను ఆయా శాఖలకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను సెప్టెంబర్ 1వ తేదీ లోగా పూర్తి చేసే విధంగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area