అథ్లెటిక్స్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ప్రారంభం **

Published: Wednesday December 14, 2022
అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 13(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులకు సూచనలు చేసి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా  కొట్నాక విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపర్చి ఎంపికైన క్రీడలు, ఈనెల 18వ తేదీన మహబూబ్ నగర్ లో జరిగే స్టేట్ మీట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి లక్ష్మణ్, కోచ్ విద్యాసాగర్, మీన రెడ్డి,యాదగిరి,ఆత్రం సాయినాథ్, క్రీడలు, తదితరులు పాల్గొన్నారు.