టేకుల సోమారం నుండి బోల్లేపల్లి రోడ్డు ను బిటి రోడ్డు గా మార్చాలి : సిపిఎం డిమాండ్

Published: Wednesday August 25, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని టేకుల సోమారం గ్రామం నుండి భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామం వరకు గల మెటల్ రోడ్డును బిటి రోడ్డుగా వెంటనే మార్చాలని సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య,జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు. టేకుల సోమవారం గ్రామంలో సిపిఎం ఏడవ శాఖ మహాసభ సిపిఎం నాయకులు రేఖల లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ మహా సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజయ్య స్వామి లు  మాట్లాడుతూ టేకుల సోమవారం నుండి బొల్లేపల్లి వరకు గల మెటల్ రోడ్డు అనేక సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారని, పూర్తిగా ధ్వంసమైన ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు పడగున్నారని,వెంటనే మెటల్ రోడ్డును బిటి రోడ్డుగా మార్చాలని వారు డిమాండ్ చేశారు. నాగిరెడ్డి పల్లి వద్ద గల రైల్వ బ్రిడ్జి కి వర్షాల వల్ల అంతరాయం ఏర్పడితే ఈ రోడ్డు ద్వారానే  ప్రయాణం చేయాలని అన్నారు. అదేవిధంగా టేకుల సోమవారం గ్రామంలో చెరువు వద్దకు వెళ్లే మార్గంలో రెండు కల్వర్టులు పూర్తిగా ధ్వంసమైనయని వెంటనే వాటిని నూతనంగా నిర్మించాలని, గ్రామంలో అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా ఆగిపోయినా పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని,గ్రామంలో పెడలుగా ఉన్న అనేకమందికి సరైన ఇండ్లు లేక  తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే వారికి డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ఇళ్లను మంజూరు చేయాలని పేదలందరికి  ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో లో సిపిఎం మండల కమిటీ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి, సిపిఎం శాఖ కార్యదర్శి చేగూరు నగేష్,సిపిఎం సీనియర్ నాయకులు దండం నర్సిరెడ్డి, కొంతం యాదిరెడ్డి, రాచూరి నరహరి, నాయకులు రేపాక ముత్యాలు, చేగురి గోపాల్, వెంకటేష్,శ్రీనివాస్ రెడ్డి, యండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. నూతన శాఖ కార్యదర్శి, సహాయ కార్యదర్శిలను చేగురి నగేష్, సహాయ కార్యదర్శి గా రాచురి నరహరి లను ఎన్నుకున్నారు.