ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలి

Published: Thursday December 02, 2021
కాగజనగర్, డిసెంబర్ 1 ప్రజాపాలన, ప్రతినిధి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఎయిడ్స్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్.ఎస్.ఎస్ (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలనుండి స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వరకు ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతు ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గమని కావున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నినాదాలు చేస్తు ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ టి.దత్తాత్రేయ, అధ్యాపకులు ఎం.రాజేశ్వర్, డి.జనార్థన్, వి.దేవెందర్, బి.వెంకటేశం, శ్రీనివాస్, మహేశ్, కృష్ణవేణి, కావ్య, పూర్ణిమ పాల్గొన్నారు.