ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ సెంటర్ లో సౌకర్యాలు కల్పించాలి

Published: Wednesday June 02, 2021

సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దుర్గం దినకర్
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 01, (ప్రజా పాలన ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లోని కరోనా వ్యాక్సింగ్ సెంటర్లో సౌకర్యాలు కల్పించాలని అధికారులపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుర్గం దినకర్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుర్గం దినకరన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ సెంటర్లో కరెంటు లేక సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అధికారులకు ముందు చూపు లేక పోవడం వలన వచ్చిన ప్రజలు పడిగాపులు కావాల్సి వస్తుంది అన్నారు. కనీసం వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ప్రజలకు కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా అధికారులు కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్ సెంటర్ లో కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగిందన్నారు. అయినా అధికారుల పనితీరు మారలేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు, జిల్లా ప్రభుత్వఆసుపత్రిని తనిఖీ చేసి, అధికారులపై చర్యలు తీసుకోవాలని, సౌకర్యాలు కల్పించాలని కోరారు.