తెలంగాణ ప్రజలకు అండగా నిలిచే పార్టీ..... వై ఎస్ ఆర్ టి పి

Published: Friday July 23, 2021

బాలాపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు, రైతన్నలకు, ప్రజలందరికీ నమ్మకం కలగాలంటే (రాజన్న) వై ఎస్ ఆర్ టి పి పార్టీ రావాల్సిందేని సీనియర్ నాయకులు ఏర్పుల విజయ పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్ నుంచి నిన్ను  షర్మిలను కలిసి వై ఎస్ ఆర్ టి పి పార్టీ లో చేరటానికి పెద్ద బావి వేణుగోపాల్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలలో కార్యకర్తలు  రాష్ట్ర నాయకుల కొండ రాఘవ రెడ్డి, పిట్ట రామ్ రెడ్డి ల సమక్షంలో పార్టీ అధినేత షర్మిల కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆ శుభ సందర్భంలో పార్టీ కార్యకర్తలు తో పాటు కలిసి సీనియర్ నాయకులు ఏర్పుల విజయ, పెద్ద బావి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గాయత్రీ టెక్నో స్కూల్ ఆవరణలో గురువారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పుల విజయ మాట్లాడుతూ..... మొదట్లో బీజేపీ పార్టీలో కొన్ని రోజులు ఉన్నాను, తర్వాత గత పది సంవత్సరాల నుంచి వైయస్సార్సీపి  రాజశేఖర్రెడ్డి సురక్షితమైన పరిపాలన లో ప్రజల అవసరాలకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నప్పుడు రాజన్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే అవకాశం ఉండేది. ఆరోగ్యశ్రీ కార్డు గానీ, పింఛన్లు గాని, ఉద్యోగులు గాని.... వగైర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు కొందరికి మాత్రమే...కొన్ని హాస్పిటల్ లో మాత్రమే అందుతున్నాయని, అందరికీ అందడం లేదని తెలంగాణ ప్రజల ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వై ఎస్ ఆర్ టి.పి ఏర్పడినాక ధైర్యంతో ప్రజల సమస్యలు తీర్చడానికి రాజశేఖర్ రెడ్డి కుటుంబం మళ్లీ వచ్చిందని ప్రశ్నించే గొంతు ఉన్నదని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య గురించి, వనపర్తి జిల్లాలో తాడిపత్రి కొండల్ అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి, ఇంకా ఇప్పటి నుంచి ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ, షర్మిల వెనువెంటనే ఉండి ప్రతి సమస్యపై పోరాడతామని అన్నారు. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ. పార్టీలో చేరినందుకు ఆనందంతో ప్రజల సమస్యలు తీర్చడానికి సంకల్పంతో ముందుకు వస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాజన్న పరిపాలన సౌలభ్యం కొరకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దేశ్వర రెడ్డి, శంకర్, ప్రత్యూష, జగదీశ్వర్ రెడ్డి, సురేష్, తులసి, సుల్తాన్, రాధిక, సిద్ధార్థ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.