పారిశుద్ధ్య పనుల ఆకస్మిక తనిఖీ : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Thursday July 01, 2021
వికారాబాద్ జూన్ 30 ప్రజాపాలన బ్యూరో : వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న హరితహారం, పారిశుద్ధ్య, అభివృద్ధి పనులు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ పౌసుమి బసు. బుధవారం వికారాబాద్ మున్సిపాలిటీలోని 3,15, 28 వార్డులను జిల్లా కలెక్టర్ పౌసుమిబసు బసు పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. పట్టణ ప్రగతి నేపథ్యంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని హైదరాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేస్తున్న పూల మొక్కల ప్లాంటేషన్ ను ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ ఏర్పాట్ల పనులపై మున్సిపల్ ఛైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కు మరిన్ని సలహాలు సూచనలు చేశారు. అనంతరం గంగారంలోని వైకుంఠదామాన్ని సందర్శించి పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పిచ్చి మొక్కలు తోలగించి మొక్కలు నాటి పట్టణాన్ని సుందరికరించాల్సిందిగా తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు గాంధీ కాలనీలో పర్యటించిన కలెక్టర్ పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. స్థానిక సమస్యలను కౌన్సిలర్ మోముల స్వాతి రాజ్ కుమార్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, కౌన్సిలర్ అనంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మోముల రాజ్ కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.