పద్మా రెడ్డి ని బెదిరిస్తే నా కేంమొస్తుంది : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Tuesday September 07, 2021
బెల్లంపల్లి సెప్టెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి: పద్మా రెడ్డి అనే మహిళా నాయకురాలును నేను బెదిరించ లేదని అసభ్యంగా మాట్లాడలేదని, ఆమె భర్త చనిపోయిన బాధలోనో, కాంట్రాక్ట్ చేసిన బిల్లులు రాకనో, ఆర్థికంగా ఇబ్బందుల వల్లనో డిప్రెషన్ కు లోనై మాట్లాడుతుందే తప్ప ఆమెపట్ల నేను ఎప్పుడూ అగౌరవంగా మాట్లాడలేదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మా రెడ్డి టిఆర్ఎస్ లో ఉంటూనే టిఆర్ఎస్ ఓటమికి ప్రయత్నాలు చేసిందని, ఆమె కొడుకు కృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి అమెరికాలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి  కోవర్టుగా ఉంటు, బీజేపీ వాళ్లకు సహాయం చేస్తాడని వారి తల్లి కొడుకుల ఉద్దేశం టిఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప పార్టీకి ఎప్పుడు పాటు పడలేదని అన్నారు. ఎమ్మెల్యే పదవి తను పెట్టిన భిక్ష అని చెప్పుకుంటుంది కానీ ఆమె పెట్టిన బిక్ష కాదని ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నన్ను కెసిఆర్ గారు టికెట్ ఇచ్చి గెలిపిస్తే గెలిచాను అది కేసీఆర్ ఆర్.బి కానీ మరెవరిది కాదని ఆయన అన్నారు. తనకు కాంట్రాక్ట్ చేసిన పనులకు బిల్లులు ఇప్పించ చడానికి నేను, నా తో పాటు ఉన్న కౌన్సిలర్లు, చైర్మన్, ప్రభుత్వ అధికారులకు ఎన్నోసార్లు చెప్పానని ఆర్థికంగా ఆమెకు ఎన్నో సహాయ సహకారాలు కూడా అందించామని, అటువంటి నన్ను అసభ్యంగా మాట్లాడాడని అనడం ఆమె నైజానికి వదిలి పెడుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.