అన్ని దానాల్లోకెల్లా రక్త దానం మిన్న రక్తదాతలు ప్రాణదాతలతో సమానం జిల్లా పరిషత్ చైర్ పర్సన్

Published: Thursday August 18, 2022
 కరీంనగర్ అగస్టు 17. ప్రజాపాలన ప్రతినిధి :            
 అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని,ఆపత్కాళ సమయంలో రక్తం అవసరమయ్యే వారి కొరకు రక్తాన్ని అందించే వారు  ప్రాణ దాతలతో సమానమని జిల్లా పరిషత్ చైర్మన్  కనుమల్ల విజయ అన్నారు.
 
 స్వతంత్ర భారతదేశంలో భాగంగా బుదవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో  సేవ్ ది లైఫ్ ఫౌండేషన్, రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్, నగర పోలీస్ కమీషనర్ సత్యనారాయణలతో కలిసి ఆమె ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతు దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను అగస్టు 8వ తేది నుండి  22వ తేది వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం రూపంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు.ఈ  సందర్భంగా జిల్లా ప్రదాన ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జవేరీయా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రత్న మాల,ఆర్ ఎమ్ ఓ డాక్టర్ జ్యోతి, మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ త్రియంబకేశ్వరరావు,ఆసుపత్రి డాక్టర్లు తదితరులు పాల్గోన్నారు.