మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం

Published: Monday February 07, 2022
మధిర ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుకాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మధిర మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మధిర మున్సిపల్  కౌన్సిలర్లు కోన దని కుమార్, మునుగోటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 8వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై వి అప్పారావు ఇచ్చిన సవాళ్లను కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది ప్లేసు డేటు మీరు చెప్పండి అలాగే మీరు ఫ్లోర్లీడర్ కాబట్టి మీరు సవాలు చేశారు అంటే మీ పార్టీ కౌన్సిలర్ మొత్తం సవాలు చేసినట్లు మా కౌన్సిలర్స్ రాజీనామా పత్రాలు పార్టీ ప్రెసిడెంట్ గా నేను తీసుకొని వస్తాను అలాగే మీ పార్టీకి రాజీనామాలు మీరు తీసుకురండి పత్రికా విలేకరుల వద్ద ఈ రాజీనామా పత్రాలు పెట్టి మేము మీరు మున్సిపాల్టీలో చేసిన అవినీతి పై ఆధారాలతో నిరూపించ కాకపోతే మా కౌన్సిలర్ ఇద్దరూ రాజీనామా చేస్తారు మేము ఆధారాలతో నిరూపిస్తే మీ కౌన్సిలర్ మొత్తం రాజీనామా చేయండి అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు మేము అధికారంలో ఉన్నాము ఉన్నాము అప్పుడు మేము చేసిన డెవలప్మెంట్ ఏంటో మేము చెబుతాము అలాగే మీరు అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయింది మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో మీరు చెప్పండి దీనిని కూడా సవాలుగానే స్వీకరిస్తున్న మీ కంటే ఎక్కువ నిధులు తెచ్చి ఉండకపోతే పార్టీ ప్రెసిడెంట్ గా నేను రాజీనామా చేస్తా లేకపోతే మీ పార్టీ వారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండండి డెవలప్మెంట్ అంటే చెట్లు నాటడం, గాబ్బుల్లో లో నీళ్లు పారబోయడం కాదు, ఆ లాంటి ఫోటోలను చూసి నీవు డెవలప్మెంట్ అనుకుంటున్నావ్ ఏమో డెవలప్మెంట్ అంటే అది కాదు ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ ఐ ఎన్ టి యు సి కోరంపల్లి చంటి మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు పారుపల్లి విజయ్ కుమార్ పులి బండ్ల చిట్టి బాబు బిట్రా ఉద్దండు ఆదూరు శ్రీనివాస్, ఆదిమూలం శ్రీనివాస్  మైలవరపు చక్రి, దోమమందులు సురేష్ తదితరులు పాల్గొన్నారు