ఆర్ అండ్ బి అధికారులు నిద్రమత్తు వీడి ఫ్లై ఓవర్ పై ప్రమాదాలు నివారించండి

Published: Wednesday November 23, 2022
బోనకల్, నవంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఫైవ్ ఓవర్ పై రోడ్డు అధ్వానంగా తయారవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని, లేనిచో తీవ్ర ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంటుందని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఫ్లై ఓవర్ పై రోజురోజుకు గుంతలు ఎక్కువై  వీధిలైట్లు లేక  ప్రమాదాలకు నిలయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే మరమ్మత్తులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.  ఎన్నిసార్లు మండల ప్రజా ప్రతినిధులు మండల పరిషత్ సమావేశంలో విన్నవించుకున్న, పత్రికల్లో వార్తలు వచ్చిన  ఫ్లై ఓవర్ పై రోడ్డు మరమ్మత్తులు నివారించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఎందుకు ఈ అధికారులకు ప్రజా ప్రతినిధుల మాట లెక్కలేకుండా పోయిందని మండల ప్రజలు అంటున్నారు. ఫ్లై ఓవర్ పై పడ్డ గుంతలను మట్టితో పూడ్చుతున్నారే తప్ప శాశ్వతంగా మరమ్మత్తులు చేయడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేశామంటూ  ప్రకటనలు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు.  ప్రజలు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడం లేదా అంటూ ఆర్ అండ్ బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం అయినందున మండలంలోని 22 గ్రామాల ప్రజలు అనేక అవసరాలు నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారని, ఇక్కడి రోడ్ల పరిస్థితిని చూస్తున్న ప్రజలు మండల కేంద్రానికి రావాలంటేనే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతోందని భయపడే దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఎన్నిసార్లు మండల పరిషత్ సమావేశంలో ఫ్లైఓవర్ రోడ్డు మరమ్మతులకు సంబంధించి  ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. త్వరితగతిన రహదారులను మరమ్మతులు చేసి, ప్రజలకు, వాహనదారులకు  ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మండల పరిషత్ సమావేశంలో పలుసార్లు ఆర్ అండ్ బి అధికారులు చెప్పడం జరిగిందని, చెప్పడమే తప్ప శాశ్వత పరిష్కారంగా మరమ్మతులు ఇంతవరకు చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు నిద్రమత్తు వీడి  ఫ్లై ఓవర్ పై ఇనుప రాడ్లు లు బయటపడి  వీధిలైట్లు లేక వాహనదారులకు గుంతలు కనిపించక తరచు ప్రమాదాలకు గురవుతున్నారని, అధికారులు కనికరించి ప్రజల కష్టాలు చూడాలని, ఫ్లై ఓవర్ పై వీధిలైట్లో అమర్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా ఫ్లై ఓవర్ రోడ్డు మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రజలు, వాహనదారులు కోరుకుంటున్నారు.