రోటరీ సేవలు అభినందనీయం* యాదాద్రి భువనగిరి జిల్లా 2 డిసెంబర్ ప్రజాపాలన:

Published: Saturday December 03, 2022
రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి
సెంట్రల్ మరియు సుమంత్ కంటి ఆసుపత్రి, భువనగిరి  సహకారం తో చేస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. స్థానిక రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇంటర్నేషనల్ సేవా సంస్థగా రోటరీ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజానికి చేరువగా ఉంటున్నాయన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్  ప్రభుత్వ పాఠశాలలకు ఎంపిక చేసుకొని విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలతో పాటు అద్దాలు కూడా ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. రోటరీ క్లబ్ క్యాంపు కన్వీనర్,   ప్రముఖ వైద్య నిపుణులు డా. సుమంత రెడ్డి( సుమంత్ కంటి ఆసుపత్రి,భువనగిరి) గారు కంటి ప్రాముఖ్యతను, తరచుగా ఎదురయ్యే సమస్యల నివారణ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంనకు  పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. పోరెడ్డి రంగయ్య అధ్యక్షత వహించగా, రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ అధ్యక్షుడు రొటేరియన్ సద్ది వెంకట్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, భువనగిరి మున్సిషన్ వైస్ చైర్మన్ చింతల క్లిష్టయ్య, క్యాంపు కో కన్వీనర్ రొటీరియన్ బుస్సా రమేష్  కౌన్సిలర్ అరుణచందర్, పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ ఎస్.వెంకటేశ్ రోటరియన్ ఉపేందర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గున్నారు.క్లబ్ పాఠశాల మౌలిక వసతులను సమకూర్చడంలో క్లబ్ తనవంతు సహకారం అందిస్తుందని క్లబ్ అధ్యక్షుడు సద్ది వెంకట రెడ్డి అన్నారు. దాదాపు 200 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిoచారు.అవసరమైన విద్యార్థిని విద్యార్థులకు  రెండు మూడు రోజుల్లో  కళ్ళజోళ్ళు  హోటల్ వివేరా యాజమాన్యం ద్వారా అందజేస్తామని గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి  తెలిపారు.