ఆసాంఘీక కార్యకలపాల నిర్ములన లక్ష్యమే (ఆపరేషన్ చబుత్ర)

Published: Monday July 19, 2021
జగిత్యాల, జులై 18 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా ఎస్పీ సిందూశర్మ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాల నిర్ములన లక్ష్యమే (ఆపరేషన్ చబుత్ర) అని పోలీసులు తెలియజేశారు. శనివారం రోజున కోరుట్ల మెట్పల్లి పట్టణంలో అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ చబుత్రాను నిర్వహించారు. యవకులు అర్ధరాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు వీధులు రోడ్లు ఫుట్‌పాత్‌లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందిలకు గురిచేస్తూ మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్ హారన్లు కొడుతూ ప్రధాన కూడళ్లలో వాహనాలను నిలిపి గుంపులుగా అనుమానస్పదంగా  తిరుగుతున్న 70 మంది యువకులను అదుపులోకి తీసుకోని వారి బైకులను పోలీసులు సీజ్ చేసి వారి తల్లితండ్రులను పిలిపించి శనివారం రోజున కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని ముఖ్యంగా యువకులు తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని తల్లిదండ్రులు పిల్లలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇకనుండి జిల్లాలో తరచుగా ఆపరేషన్ చబుత్రా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందని అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా సంచరిస్తూ సామాన్య ప్రజానీకానికి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.