బూర్గంపాడు మండలం సారపాకలో విప్ రేగా కాంతారావు సుడిగాలి పర్యటన , రేగా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార

Published: Friday November 25, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్డు నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలోని వాసవి ఫంక్షన్ హాల్ నందు  పలు ఏరియాలకు చెందిన వారు సుమారు 100 మంది యువకులు మరియు కండక్టర్ కాలనీ ఏరియాలో సుమారు 30 మంది యువకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  సమక్షంలో  బిఆర్ఎస్  లో చేరిక, పార్టీలో చేరిన వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన రేగా కాంతారావు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ ,యువత రాజకీయాల్లోకి రావాలని , సమాజం పట్ల సేవాభావం కలిగి ఉండాలని, యువకులు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్  ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేపట్టి బంగారు తెలంగాణ దిశగా ముందుకు దూసుకు వెళ్తున్నారన్నారు.అభివృద్ధి పరంగా చూస్తే దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న దాని కోసం సీఎం కేసీఆర్  నిరంతరం శ్రమిస్తున్నారన్నారని, సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాలను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి అందించుటకు నా సర్వశక్తులా పనిచేస్తున్నానని  ఆయన అన్నారు.
నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడు ముందే ఉంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్  అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలుకు ఆకర్షితుల ఇతర పార్టీల నుంచి నేతలు  పార్టీ వైపు పరుగులు పెడుతున్నారని  ఆయన అన్నారు.
ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని మోసపూరిత నాయకులు వినే పరిస్థితిలో ప్రజలు లేరని వివరించారు, కలిసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసి గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని భవిష్యత్తులో అన్నారు
సీఎం కేసీఆర్  తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు, పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారని, కెసిఆర్ కిట్టు పేరుతో అమ్మాయి పుడితే 13వేల రూపాయలు,  అబ్బాయి పుడితే 12,000 వీటితోపాటు 15 రకాల వస్తువులతో కెసిఆర్ కిట్టును అందిస్తున్నారన్నారని ఆసరా పెన్షన్, రైతుల కోసం రైతుబంధు 24 గంటల ఉచిత విద్యుత్ పేదల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారన్నారు వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయని వారు తెలియజేశారు.ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే ఏం కేసీఆర్  లక్ష్యమని అన్నారు, సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సాధించిందని చెప్పారు, ప్రజలకు నాణ్యతతో కూడిన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించాలనే సంకల్పంతో దవఖానాల అభివృద్ధికి నిధులు కేటాయింపులో పెద్దపీట వేస్తుందని అన్నారు
పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలు, రూపొందిస్తున్నామన్నారు. మౌలిక వసతుల కార్యచరణ పై శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన తెలిపారు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు ఆయన అన్నారు, అదేవిధంగా మిగిలిపోయినటువంటి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో  బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల యువజన సంఘం విభాగం అధ్యక్షుడు గోనెల నాని, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జనగం జగదీష్, సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, బాలాజీ ,సాయిబాబా, పూర్ణ చైతన్య ,ఏసోబు, బాలు శ్రీహరి ,మణికంఠ, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం నాయకులు, పెద్ద ఎత్తున యువకులు , తదితరులు పాల్గొన్నారు.