యువకుల కోసం ఉచిత ఇండియన్ నేవీ శిక్షణ

Published: Tuesday April 27, 2021
మల్లాపూర్, ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి : యువకుల కోసం సువర్ణ అవకాశంగా ఉచిత ఇండియన్ నేవీ శిక్షణ కార్యక్రమాన్ని మల్లాపూర్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. వీటి కరపత్రాలను సోమవారం మల్లాపూర్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రవీందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇంటర్మీడియట్ లో 70 శాతం ఉత్తీర్ణత ఉన్న విద్యార్థులు ఈ నేవి శిక్షణకు అర్హులు. శిక్షణ  పొందనున్న వారికి శిక్షణకు సంబంధించిన మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడును. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను ఈనెల 30వ తేదీ లోగా రుద్ర రాంప్రసాద్ మీసేవ యందు దరఖాస్తులను తీసుకోబడును. శిక్షకులుగా సిరిపురం విజయ్ కుమార్, నాగుల నరేష్ కుమార్ వ్యవరిస్తారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.