పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను తగ్గించాలి సిపిఎం

Published: Thursday February 18, 2021

వలిగొండ ప్రజాపాలన పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కమిటి పిలుపు మేరకు బుధవారం మండల కేంద్రంలో భువనగిరి-నల్గొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన అనంతరం దిష్టిబొమ్మను దగ్దం చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య,జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచి సామాన్యులకు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు పెడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, ధరలపై 51% ట్యాక్సీల రూపంలో వాటా తీసుకుంటున్నారని అన్నారు.పేదలు కనీసం వంట గ్యాస్ సిలిండర్ ను కొనుకోలేని స్థితిలో 900 రూపాయలకు పెంచారని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలు వెంటనే తగ్గిచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం ఎల్)జిల్లా నాయకులు శీలం స్వామి పాల్గొని మద్దతు ఇవ్వగా సిపిఎం మండల కమిటి సభ్యులు కూర శ్రీనివాస్, మెరుగు వెంకటేశం, కల్కురి రామచందర్, కందాడి సత్తిరెడ్డి నాయకులు కవిడే సురేష్, ధ్యానబోయిన యాదగిరి, వెల్మకన్నె బాలరాజు, దుబ్బ లింగం, బీమనబోయిన జంగయ్య, మారబోయిన నర్సింహా, కొంతం తిర్మల్ రెడ్డి, ఆంగిటి దేవేందర్ రెడ్డి, వడ్డమాని మధు, గూడూరు బుచ్చిరెడ్డి, గోగు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.