అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా మానవహారం.....

Published: Thursday December 02, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని బనిగండ్లపాడు గ్రామంలో బుధవారం డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బనిగండ్లపాడు వైద్యసిబ్బంది మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజి విద్యార్థులు, సిబ్బంది ఆధ్వర్యంలో బనిగండ్లపాడు గ్రామంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన, ర్యాలీ మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రాజు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పై అందరూ అవగాహన కలిగి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గమని ఈ వ్యాధి ఆసురక్షిత లైంగిక సంబంధాలు, రక్తమార్పిడి ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రతి ఒక్కరూ తమ భాగస్వాములతోనే సంబంధాలు కలిగిఉండాలని,లేక పోతే సురక్షిత పద్దతికోసం కండోమ్ తప్పనిసరిగా వాడాలని అప్పుడే ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి సోకకుండా నిరోధించ వచ్చని వ్యాధి సోకినవారు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ పౌష్టికాహారం తీసుకుంటే ఎక్కువకాలం జీవించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి, రామారావు, సూపర్ వైజర్ కె.వెంకటేశ్వరావు, స్టాఫ్ నర్స్ రోజా, హెల్త్ అసిస్టెంట్ శాయిరెడ్డి, రూరల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అనూష, శ్రీనివాసరావు, పుల్లారెడ్డి, కాలేజి విద్యార్థులు, మరియు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.