ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలి

Published: Wednesday June 02, 2021

మధిర ప్రజాపాలన ప్రతినిధి : ఒకటో తేదీమధిర మునిసిపాలిటి మరియు మధిర నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ హాస్పటల్ లో ఉన్న సమస్యల గురించి, అయ్యా! మధిర నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మధిర సి హెచ్ సి హాస్పటల్ మరియు నియోజకవర్గంలో ఉన్న, అన్ని ఏ హెచ్ సి లో డాక్టర్లు మరియు సిబ్బంది తగినంత మంది లేక పోవడం వలన ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితులలో సరైన సమయంలో వైద్య సౌకర్యం అందక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లు కూడా ఉన్నవి. కావున మధిర సి హెచ్ సి, మరియు నియోజకవర్గం పరిధిలోగల అన్ని పీ హెచ్ సిలలో వైద్యులు మరియు వైద్య సహాయక సిబ్బంది మరియు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ పోస్టులను వెంటనే భర్తీ చేయగలర ఖమ్మం జిల్లాలో మంత్రి గారికి సంబంధించిన ప్రైవేటు మమత మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నది, పేదలు బడుగు బలహీన వర్గాల వారు ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలంటే ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున మా ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయగలరు, మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేసి మా ఖమ్మం జిల్లా కు మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీ మంజూరు చేయలేదు దయచేసి ఇప్పడికి ఐన తమరు మా జిల్లా కు ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయగలరని మా యొక్క విన్నపము. మరియు మధిర CHC హాస్పిటల్ గా ఉన్నటువంటి హస్పత్రిని ఏరియా హాస్పిటల్ గా మార్చగలరు. మధిర మరియు నియోజకవర్గం PHC పరిదిలో కోవిడ్ టెస్ట్ లు పెంచగలరు, Vaccanation ను పూర్తి స్థాయిలో వేయగలరు. కొన్ని హాస్పిటల్స్ ఉన్న బిల్డింగ్స్ శిదిలవవాస్తలో ఉన్నవి వాటిని పూర్తిగా తొలగించి కొత్త బావనలను నిర్మించ గలరు ఈ కార్యక్రమంలో షోరూంశెట్టి కిషోర్  మిరియాల రమణగుప్తా దారా బాలరాజు నవీన్ రెడ్డి చావా వేణు చిట్టి బాబు