ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

Published: Thursday October 07, 2021
కోరుట్ల, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అదేశాలమేరకు కోరుట్ల పట్టణంలో జాతీయ రహదారి అర్డిఓ కార్యాలయం ముందు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలో ని మైనారిటీల సంక్షేమనికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి. రూ.10వేల కోట్లు బడ్జెట్ ను కేటాయించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్నీ కోరారని, మంగళవారం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి లో మైనారిటీల సమస్యలపై జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య అనంతరం ముస్లిం, మైనారిటీలు సామాజికంగా ఆర్ధికంగా వెనకబడి పోయారని ప్రత్యేక ఉపాధి కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైస్సార్ ఆధ్వర్యంలో మైనార్టీల సంక్షేమనికి, 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించినప్పటికి కోర్ట్ ఆదేశాలతో రిజర్వేషన్ లు 4 శాతానికి పరిమితమయ్యాయి అన్నారు, అప్పటి 4 శాతం రిజర్వేషన్ లతోనే నేటి వరకు మైనారిటీలు విద్య, ఉద్యోగ రంగాల్లో రాజకీయాల్లో, రిజర్వేషన్ పొందుతున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మైనారిటీలకు 4 నుంచి 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రం సహరించక పోవడంతో రిజర్వేషన్లు 4 శాతానికి పరిమితయ్యాయని, రిజర్వేషన్ 12 శాతం కల్పించక పోయినప్పటికీ 12 శాతం నిధులు కేటాయింపు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కల్గివుందన్నారు, 2015లో మైనారిటీల స్థితి గుతులపై అధ్యయనం చేయడానికి సుధీర్ కమిటీ ఏర్పాటు చేయడంతో నామ మాత్రంగానే మిగిలింది అన్నారు 99 శాతం మైనారిటీలు అర్బన్ ప్రాంతంలకు తరలి వెళ్లారని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపాధి కల్పన చర్యలు తీసుకోకపోవడంతో గల్ఫ్ దేశాలకు అధికంగా వలసపోతున్నారన్నారు, ఎక్కువ శాతం మైనారిటీలు డ్రైవర్లు, ఫ్రూట్ వెండర్లు, టీ స్టాల్, చిన్న చిన్న వ్యాపారామ్, చేసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సామాజికంగా వెనక బడిన మైనారిటీలకు కేయయించిన బడ్జెట్ ఏ విధంగా ఉపకరించడం లేదన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షాధి ముబారక్ పథకం మంచి పథకామని, మైనారిటీ గురుకులల ఏర్పాటు తో కొంత మేర మైనారిటీల పిల్లలకు విద్య అందుతుందన్నారు, గతంలో సీఎం కేసీఆర్ మైనారిటీ సాబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు అన్నార. మైనార్టీలకు కేటాయిస్తున్న బడ్జెట్ లో 65 శాతంనిధులు కేవలం షాధిముబారక్. గురుకుల పాఠశాలకు ఖర్చు చేస్తున్నారని మిగతా 35 శాతం తో మైనారిటీల సామాజిక వెనుకబాటుతనం దూరం కాదన్నారు, ఇప్పటి కైనా రాష్ట్ర ప్రబుత్వం మైనారిటీల సంక్షేమనికి చర్యలు తిసుకోవలని మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి 10 వేలకోట్ల బడ్జెట్ కేటాయించి మైనారిటీల ఉపాధి కల్పన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిండు సభలో ఒక పక్క నిలదిస్తూనే. ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన జీవన్ రెడ్డి గారికి కృతజ్ఞతతో రాష్ట్ర మైనారిటీల పక్షణ ఈరోజు పాలాభిషేకం చేశామని ఎల్లవేళలా ప్రభుత్వన్నీ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు జీవన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు ఉపాధ్యక్షులు తిరుమల గంగాధర్, నాయిమ్, జిల్లాకిసన్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్, యూత్ నియోజకవర్గ అద్యక్షులు ఏలేటి మహిపాల్, మాజీ కౌన్సిలర్ సోగ్రాభి, మాజీ పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు ఏఆర్ అక్బర్, తుపాకుల భాజన్న ముదిరాజ్, యండి రహీం, యండి నసీర్, యండి జనిల్, సయ్యద్ రహీం, యండి యూసుఫ్, షోహెల్, ఫాక్రోద్దీన్, యాకుబ్, యండి అన్వర్, ముజమ్మిల్, రిజ్వాన్, తైసిన్, అదిల్, అజ్జు, నిజం, ఆర్షద్, ఆహ్మద్, పాయజ్, నవిద్, ఇషాక్, ముజాహిద్, తదితరులు పాల్గొన్నారు.