మనిషిని అత్యునత్త స్థితికి చేరవేసే సాంకేతిక పరిజ్ఞానమే యోగా

Published: Tuesday June 22, 2021
-  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇందిరారెడ్డి ఆల్విన్ కాలనీ వద్ద యోగ గురువు రాంచెందర్ రెడ్డి సమక్షంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర, జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యోగ దినోత్సవాన్ని జరుపుకునేలో భాగంగా యోగ సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని సాధన చైయడం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హిందుత్వ ఆధ్యాత్మిక సాధనం, తాత్విక మూలం, వ్యాయామ సాధనల సమాహారం, ధ్యానం, అంతదృష్టి, పరమానంద ప్రాప్తికి పునాది యోగా అని అన్నారు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు, అది మనిషిని తను చేరుకోగల అత్యునత్త స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానమన్నారు. అసలు 'యోగా' అంటే 'ఐక్యం' అని అర్థం. మనం అన్నిటితో ఐక్యం అయితే, అదే యోగా అన్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ మొత్తం అస్థిత్వం కూడా ఒక్కటే శక్తి అని, అదే లక్షల కొద్ది మార్గాలలో వ్యక్తమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందన్నారు. ప్రపంచానికి యోగాని పరిచయం చేసిన నరేంద్ర మోదీ బాటలో పయనించి తద్వారా ఆర్యోగ భారతంగా నిలిచి ప్రపంచానికి మార్గదర్శకులు అవుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ రెడ్డి, లక్ష్మణ్, కోటేశ్వరరావు, రవి గౌడ్, జితేందర్, బాబు రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శివ, రవి, విజయ్ కుమార్, స్థానికులు పాల్గొన్నారు.