తహసీల్దార్ ఆఫీసు ముందే శిఖం భూములు కబ్జా అవుతుంటే సోద్యం చూస్తున్న అధికారులు

Published: Monday November 22, 2021

ప్రజాసంఘాల జాక్ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ఆరోపణ

కోరుట్ల, నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూతవేటు దూరంలో వున్న మద్దెలచెరువు శిఖం భూమిలో రియల్టర్లు యదేచ్చగా చదును చేసి ప్లాట్లుగా మార్చుతున్న సోద్యం చూస్తున్న అధికారులు, పాలకులు ఇకనైనా స్పందించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ఆరోపించారు.ఆదివారం కోరుట్ల పట్టణంలోని తన కార్యాలయంలో పేట భాస్కర్ మాట్లాడుతూ దాదాపు 49 ఎకరాల చిల్లర స్థలం కలిగిన మద్దెలచెరువు ప్రాంతాన్ని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ బి ఆర్ మినా గారి ఆద్వర్యంలో అప్పటి కోరుట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేసి హద్దులు వేసి ఎఫ్ ఎల్ టి గుర్తించారని ఇప్పుడు అ హద్దులన్ని కబ్జాలకు గురైనట్లు తెలిపారు. ఇకనైనా మిగిలిన స్థలాన్ని కాపాడలని చదును చేసిన వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకోని శిక్షించాలని మద్దెలచెరువు ప్రాంతాన్ని  అహ్లాదకరమైన ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలని పేట భాస్కర్ డిమాండ్ చేశారు.