ఎమ్మెల్సీ పట్టభద్రులకు ఎన్నికల అవగాహన

Published: Tuesday March 02, 2021

50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్
10 మంది ఇంచార్జులకు మరొక ఇంచార్జ్
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా మార్చ్ 01 ( ప్రజాపాలన ప్రతినిధి ) : సోమవారం జిల్లా ఇంఛార్జి జహంగీర్ పాషా, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన వికారాబాద్ పట్టణంలోని క్లబ్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణకు సంభందించిన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతి  50 (యాభై) మంది ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమించడం జరిగింది ఇలా నియమించిన ప్రతి 10 మంది ఇంచార్జికు ఇంకొక ఇంచార్జిని నియమించారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పిఏసిఎస్ చైర్మన్లు, ఏఎంసి చైర్మన్లు, పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ పట్టభద్రుల అవగాహన సమావేశాన్ని నిర్వహించామని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వివేక వాణి పాఠశాలలో టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సురభి వాణి దేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరించాలని కోరారు.ఉపాధ్యాయులు అందరూ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ : వికారాబాద్ పట్టణ పరిధిలోని కొండా బాలకృష్ణా రెడ్డి గార్డెన్ ముందు గుర్తు తెలియని వ్యక్తి యాక్సింట్ కారణంగా రోడ్డుపై పడ్డాడు. ఆ దారి గుండా వెళ్తున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్డు పై పడ్డ వ్యక్తి శ్వాస నాడిని పరీక్షించి తగు వైద్య సహాయం అందించారు.రోడ్డు ప్రమాదంలో తీవ్ర రక్త గాయాలైన వ్యక్తిని ఆటోలో ఎక్కించి హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆ వ్యక్తికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఫోన్ లో ఆదేశించారు.