వానవీ క్లబ్ కు అవార్డుల పంట

Published: Tuesday October 05, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 04, ప్రజాపాలన : మంచిర్యాల వాసవీక్లబ్ 2021 సంవత్సర కాలంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలకు గాను ఆదివారం మంచిర్యాల విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో నిర్వహించిన పుల్లూరీస్ రీకాల్లో అవార్డుల పంట పండింది. వివిధ సేవా కార్యక్రమాలను అంతర్జాతీయ వాసవీక్లబ్   సేవలు అందించినందుకు గాను బెస్ట్ వాసవీక్లబ్ అవార్డు, ఫస్ట్ బెస్ట్ క్లబ్ అధ్యక్షుడు, ఫస్ట్ బెస్ట్ క్లబ్ సెక్రటరీ, ఫస్ట్ బెస్ట్ క్లబ్ ట్రెజరర్ అవార్డులతో పాటు బెస్ట్ ఫోటో బ్యానర్ డిస్ప్లే అవార్డు, బెస్ట్ ఫోటో ఆల్బమ్ అవార్డు, బెస్ట్ సాక్ అవార్డు, బెస్ట్ సర్వీస్ అవార్డు, బెస్ట్ వికెఎస్పి, బెస్ట్ కేసిజిఎఫ్ అవార్డులను సొంతం చేసుకుంది. అదే విధంగా మంచిర్యాల వాసవీ వనితా క్లబ్ కు సెకండ్ బెస్ట్ అధ్యక్షురాలు, సెకండ్ బెస్ట్ కార్యదర్శి, సెకండ్ బెస్ట్ కోశాధికారి, బెస్ట్ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు, బెస్ట్ మెంబర్ షిప్ గ్రోత్ అవార్డులు , లక్షెట్టిపేట వనితా క్లబ్ కు సెకండ్ బెస్ట్ బ్యానర్ ప్రజెంటేషన్, శ్రీరాంపూర్ వాసవీ క్లబ్ కు బెస్ట్ రిజిస్ట్రేషన్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ రికాన్ కార్యక్రమంలో పలువురు చిన్నారుల కళావృత్యాలు, సురేష్ బృందం ఆలపించిన అర్కేస్ట్రా చూపరులను ఆకట్టుకున్నాయి.