*ఆమ్ ఆద్మీ పార్టీ బస్తీ బాట*

Published: Monday April 10, 2023
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 08, ప్రజాపాలన: మంచిర్యాల ఆమ్ ఆద్మీ పార్టీ బస్తీ బాట కార్యక్రమం 16వ రోజులో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ లోని  తొమ్మిదో వార్డులో ఆదివారం రోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ కోఆర్డినేటర్ నయీమ్ భాష మాట్లాడుతూ వార్డుల్లో కొన్ని లైన్ల కు సంబంధించి రోడ్లు డ్రైనేజీ కరెంటు లైన్ ఫెసిలిటీ లేదు మిషన్ భగీరథ వాటర్ చాలా మురికిగా వస్తున్నా కూడా కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఉన్న వాటర్ ట్యాంకు లోపల చెట్లు బురదతో నిండి ఉంది కాంపౌండ్ వాల్ విరిగిపోయి సంవత్సరాలు గడుస్తున్నా కూడా పట్టించుకోవడం లేదని దీనితో పందులు పాములు రావడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కౌన్సిలర్   చైర్మన్ ల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా కూడా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. వెంటనే సింగరేణి యాజమాన్యం మున్సిపాలిటీ వారు  స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.