ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సిపిఆర్ శిక్షణ కార్యక్రమం

Published: Friday April 14, 2023

బోనకల్, ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురువారం డాక్టర్ స్రవంతి అధ్యక్షతన సి పి ఆర్ శిక్షణ కార్యక్రమము నిర్వహించారు. ఈ సిపిఆర్ కార్యక్రమమును శిక్షణ ఇచ్చుటకు ప్రత్యేక అధికారి డాక్టర్ నిత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఆర్ ఇచ్చుటకు 108 కి కాల్ చేయండి లేదా ఇతరులను చేయమని చెప్పండని తెలియపరిచారు. సిపిఆర్ చేసే విధానం వ్యక్తిని వెలికిల పడుకోబెట్టి శ్వాస సంబంధిత అడ్డంకులను తొలగించాలని తెలియపరిచారు. శ్వాస తీసుకొని పక్షంలో సిపిఆర్ వ్యక్తి చాతిపై 30 సార్లు కంప్రెస్ ఇవ్వాలని , లేదా రెండు రెస్క్యూ ఇవ్వండి అంటూ తెలియపరిచారు. అంబులెన్స్ లేదా ఏ ఈ డి వచ్చేవరకు కొనసాగించాలని సూచనలు ఇచ్చారు. వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు కూలిపోయినట్లు అయిపోతారు. కావున వ్యక్తి శరీరంలో చలనం లేకుండా పోతుంది. వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయినాడు చూసుకోవాలని, పడిపోయినప్పుడు చుట్టుపక్కల పరిసరాలు బాగా ఉన్నాయో లేదో చూసుకోవాలని, అటువంటి సమయంలో 108 కి వెంటనే కాల్ చేయాలని సూచించారు. పడిపోయిన వ్యక్తి పల్స్ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలని, చేతులను స్ట్రైట్ గా ఉంచి 30 సార్లు కంప్రెస్స్ ఇవ్వాలని, రెండుసార్లు బ్రీత్స్ ఇవ్వాలని, వ్యక్తిని ఎడమ పక్కకు తిరుగునట్లు చేయాలని, అలా ఉన్నప్పుడు 40 నిమిషాల వరకు మెడ వద్ద పల్స్ చూడాలని, ముక్కు వద్ద శ్వాస చూడాలని, లేనిచో కంప్రెషన్ ఇస్తూ ఉండాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.