స్వయంగా తన డివిజన్ లో శానిటేషన్ చేస్తున్న కార్పొరేటర్

Published: Saturday May 15, 2021
బాలపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన : ప్రతి ఒకరికి 5వ డివిజన్ కాలనీ వాసులందరూకి పేరుపేరునా కరోనా పాజిటివ్ వచ్చిన వారు మనోధైర్యంతో భయపడకుండా ఉండాలని స్థానిక కార్పొరేటర్ చెప్పారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ లో కరోనా మహమ్మారి వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కార్పొరేటర్ బోయిన్పల్లి దీపికా శేఖర్ రెడ్డి ఒకరోజు తప్పించి ఒక రోజు బ్లీచింగ్ పౌడర్, హైడ్రోక్లోరిక్ ద్రావణాన్ని పిచికారి చేసి, ప్రతి ఒక్కరికి మనోధైర్యం కల్పించిన వ్యక్తిత్వం మనిషిని కాలనీవాసులు కొనియాడారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ..... రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఎవరికీ ఎలాంటి ఆపదలో ఉన్న ఏ సమయంలో అయినా నేనున్నానని భరోసా కలిగించారు. ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కరోన వైరస్ సోకిన వారికి డాక్టర్ సలహాలతో మందులు సమయానికి వేసుకొని, పోష్టకహారాన్ని తీసుకున్నట్లయితే కరోనాను తరిమికొట్టొచ్చు అని అన్నారు. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలిని, మాస్కు భౌతిక దూరం పాటించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా ఎల్లవేళలా ఉండేటట్లు చూస్తానని కాలనీవాసులకు స్థానిక కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.