ఉద్యోగ వయసు పరిమితిని 40ఏళ్లకు పెంచాలి : టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస రావు

Published: Monday October 11, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి: సింగరేణిలో కారుణ్యము కింద అన్ పిట్ అయి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న కొడుకులకు లేదా వారసులకు ఉద్యోగ అర్హత వయసు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పెంచేలా కృషి చేయాలని మరియు రెండు పేర్లు ఉన్న కార్మికులకు వారి ఒరిజినల్  పేరు మార్చే విధంగా చూడాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మాల్రాజు శ్రీనివాసరావు కేంద్ర కమిటీని కోరారు. ఆదివారం నాడు గోదావరిఖని లోని ఇల్లందు క్లబ్బులో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో మాట్లాడుతూ అధ్యక్షులు శ్రీ బి.వెంకట్ రావు అధ్యక్షతన గోదావరిఖని లోని ఇల్లందు క్లబ్ లో జరిగిన కేంద్ర కమిటీ  సమావేశంలో  శ్రీనివాసరావు  మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో త్వరలో 2 ocp లు రానున్నాయని కావున మరింత మందిని కార్మికులు నియమించాలని కోరారు. ఇన్కమ్ టాక్స్ లో పెర్క్స్ పేరు మీద విధిస్తున్న టాక్స్ను రద్దు చేయాలని కోరారు. మైనింగ్  సోదరులకు అండర్ గ్రౌండ్ లో ఆన్ పిట్ అయిన క్రమంలో సర్ఫేస్ లో అదే ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి హాస్పిటల్ ను మంచిర్యాల జిల్లా కరోనా హాస్పిటల్ గా కేటాయిం చడం వలన కార్మికులకు వైద్య సౌకర్యం అందక ఇబ్బందులు తలెత్తుతున్నదని అన్నారు. కావున కరోనా ఆసుపత్రిని వేరేచోటికి తరలించాలి అని కోరారు. సింగరేణిలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెల్లంపల్లి ఏరియా లో అత్యధిక మెజారిటీతో గెలిస్తామని తెలియజేశారు. హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం బెల్లంపల్లి ఏరియా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని తెలియజేశారు. సందర్భంగా అధ్యక్షడు వెంకట్రావు మాట్లాడుతూ టీబీజీకేఎస్ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. కార్మికులకు అందుబాటులో ఉండి కేసీఆర్ మరియు యూనియన్ అందించిన హక్కులను వారికి తెలియ చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, మాజీ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య, అన్ని ఏరియాల ఉపాధ్యక్షులు, సెంట్రల్ కమిటీ నాయకులు,11 మెన్ కమిటీ సభ్యులు మరియు బెల్లంపల్లి ఏరియా నుండి సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగం ప్రకాష్ రావు 11 మెన్ కమిటీ మెంబర్ ధరావత్ మంగిలాల్ సెంట్రల్ కమిటీ సభ్యుడు గెల్లి రాజలింగు, మల్రాజు శ్రీనివాసరావ్ తదితరులు పాల్గొన్నారు.