ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి * ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి

Published: Thursday December 08, 2022

మున్సిపల్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లుగానే 21వేల వేతనం తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ బుగ్గరాములు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బుగ్గరాములు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 21 వేల వేతనం ఇస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మున్సిపాలిటీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ లో బిల్లు కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు,  పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ వర్క్, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, పంపు ఆపరేటర్లుగా సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తూ వివిధ కేటగిరీలలో పనిచేస్తున్నారు నేటికీ పర్మనెంట్ కాలేదు. చేస్తున్న పనికి భద్రత లేదు. కనీస వేతనాలు అమలు కావడం లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న తీర్పులను కూడా అమలు చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తోపాటు స్కీం వర్కర్లకు కూడా 2021 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది కానీ 11వ పిఆర్సి చైర్మన్ సిఫారసు చేసిన కేటగిరీల వారీగా నిర్ణయించిన వేతనాలు రూ.19000/- లు, రూ.22900/- లు, రూ. 31040/- లు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 విడుదల చేసి రూ.15600/- లు, రూ. 19500/- లు, రూ.22750/- లు  కేటగిరి వారిగా వేతనాలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఈ నిర్ణయం ప్రకారం పారిశుద్ధ కార్మికులకు కేటగిరీగా వేతనాలు అమలు చేయకుండా మోసం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు రూ.21000/- ల వేతనం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ పండుగలతో పాటు వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 13వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాబు, జగన్, భాస్కర్, రాజేందర్, బాలయ్య, పుష్ప, ఇంద్రమ్మ, లావణ్య, రమేష్, జయమ్మ, సుజాత, లక్ష్మమ్మ, అండాలు, నాగమణి, నరసింహ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.