చేతికొచ్చిన పంట నేల పాలు

Published: Wednesday May 05, 2021
బిజెపి జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి
వికారాబాద్, మే 04, ప్రజాపాలన బ్యూరో : చేతికొచ్చిన మామిడి పంట అంతా నేల పాలయ్యిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ మండల పరిధిలోని మదన్ పల్లి, పులుసుమామిడి కామారెడ్డి గూడ, అత్త్వేల్లి తదితర గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వివిధ పంటలకు గిట్టుబాటు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పట్నం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వెంటనే తగిన న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి పాండు గౌడ్, జిల్లా నాయకులు అమారేందర్ రెడ్డి జిల్లా సంఘటన కార్యదర్శి శ్రీధర్,  వివిధ గ్రామాల రైతులు  పాల్గొన్నారు.