మధిర మున్సిపాలిటీ జూలై 1 ప్లాస్టిక్ నిషేధం మధిర జూన్ 28 మంగళవారం నాడు మున్సిపాలిటీ పరిధిలో ము

Published: Wednesday June 29, 2022

ఉత్తర్వుల జారీ120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి వాడొద్దుదుకాణాల్లో ఇస్తే రూ.5 వేల వరకు జరిమానావాడి పడేసే వారికీ గరిష్ఠంగా రూ.500 విధింపురాష్ట్రంలో జులై ఒకటో తేదీ నుంచి ఒకసారి వాడి పారేసే పల్చటి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం) ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో దీన్ని అమలు చేయాలని పురపాలకశాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ గురువారం ఆదేశించారు. తయారీ, సరఫరా, విక్రయం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు. నిషేధం అమలుకు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆ వివరాలు..*
నిషేధంపై విస్తృత ప్రచారం కల్పించాలి. పటిష్ఠ అమలుకు టాస్క్‌ఫోర్స్‌కమిటీలను ఏర్పాటు చేయాలి.నిబంధనలు అతిక్రమించేవారి నుంచి జరిమానా వసూలు.జలవనరులు, ప్రధాన డ్రైన్లలో ప్లాస్టిక్‌ వ్యర్థాల పూర్తి తొలగింపు.సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రచార బోర్డుల ఏర్పాటు.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై విస్తృత ప్రచారం కల్పించడం.. అవగాహన కల్పన.దుకాణాల్లో వస్త్ర సంచులను ప్రోత్సహించాలి. కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా వాటి పంపిణీకి చర్యలు తీసుకోవాలి.నిషేధం అమలుపై ప్రతి పురపాలక సంఘం వారం వారం నివేదిక పంపాలి.నిబంధనలు అతిక్రమించినవారి నుంచి జరిమానాలు వసూలు చేయాలి.*
దుకాణాల్లో మొదటిసారి పట్టుబడితే రూ.2500 నుంచి రూ.5000 దాకా జరిమానా విధించాలి.*
నిషేధించిన ప్లాస్టిక్‌ బ్యాగులను ఎక్కడపడితే అక్కడ పారేసే వ్యక్తులపై రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా.టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఇలామున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో శానిటరీ సూపర్‌వైజర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఇద్దరు, పోలీస్‌ కానిస్టేబుల్‌తో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటవుతాయి. వీటికి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు వారంలో కనీసం రెండుసార్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అతిక్రమణదారులపై చర్యలు తీసుకుంటాయి.*వ్యాపారస్తులు, ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాంమధిర మున్సిపాలిటీ. కమిషనర్ అంబటి రమాదేవి.