స్వచ్చత పక్వాడను విజయవంతం చేయాలి.. జేఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ రాధాకృష్ణ..

Published: Tuesday July 19, 2022
తల్లాడ, జులై 18 (ప్రజాపాలన న్యూస్):
జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మంజిల్లా  ఆధ్వర్యంలో సోమవారం నేలకొండపల్లి మండలంలోని బోధులబండ, ముజ్జుగూడెం, రామచంద్రపురం, జక్కెపల్లి  గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలు, కోవిడ్ 19 అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎస్ఎస్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ మాట్లాడుతూ  ప్రజలందరు విధిగా మాస్క్స్ దరించాలని,  శానిటైజర్స్ ఉపయోగించాలని సూచించారు. అందరు ఆరోగ్యాంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటిని తొలగించాలని, ఇంటి చుట్టూ పిచ్చిమొక్కలు తొలగించాలని తెలిపారు. గ్రామ పంచాయత్ ఆవరణంలో పిచ్చిమొక్కలను లబ్దిదారులతో తొలగించారు. యువత ఉద్వోగం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడాలనుకునే వారు ఎప్పడికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరాక్చుకొని అంది వచ్చే అవకాశాలను వినియోగించుకొవాలని డైరెక్టర్ అన్నారు. జె యస్ యస్ ద్వారా 12 రకాల వృత్తి విద్యా నైపుణ్యాల శిక్షణలను ఉచితంగా అందించ బడుతున్నాయి. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.