నిరుపేద కుటుంబానికి లయన్స్ క్లబ్ చేయూత

Published: Monday October 18, 2021

వెల్గటూర్, అక్టోబర్17(ప్రజాపాలన ప్రతినిధి): నిరుపేద కుటుంబానికి వెల్గటూర్ లయన్స్ క్లబ్ కోశాధికారి గట్ల రాజేందర్  కుమారుడు గణేష్ ఇద్దరి పుట్టిన రోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి చేయూతను అందించారు. వృద్ధురాలు గాజుల రాజవ్వ కు రూ.1000 నగదు, దివ్యంగురాలైన ఆమె కూతురు రంగు సువర్ణ కు దుస్తులను ఆదివారం రోజు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మద్ది మురళీధర్, కార్యదర్శి వైద్య వెంకట్, ఉపాధ్యక్షులు సిరిపురం తిరుపతి, నోముల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.