ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులను సిబ్బందిని సత్కరించిన జిల్లా వైద్యాధికారి పుట్ల శ

Published: Friday November 11, 2022
మేడిపల్లి, నవంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి)
ఇటీవల ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్ పై మూర్ఛతో పడిపోయిఉన్న వ్యక్తికీ చికిత్స చేయాలనీ అత్యవసరంగా కాల్ రాగా  ఉప్పల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు సిబ్బంది 
సకాలంలో స్పందించి వైద్య చికిత్సను అందించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న మేడ్చల్ జిల్లా వైద్య & ఆరోగ్యశాఖాదికారి పుట్ల శ్రీనివాస్ ఉప్పల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ మంజుల వాణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌందర్య లతలను మరియు సిబ్బందిని శాలువాలతో సన్మానించి  అభినందించారు. ఆరోగ్యశాఖ మంత్రి తన్నేరు హరీష్ రావు ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తమ  రెగ్యులర్ విధులు కాకుండా అవసరం వచ్చినపుడు ఒక అడుగు ముందుకు వెళ్లి అవుట్ అఫ్ బాక్స్ పనిచేయాలని  జిల్లా వైద్య అధికారి పుట్ల శ్రీనివాస్ సూచించారు. ప్రతి ఒక్కరూ ఉప్పల్ పీహెచ్‌సీ సిబ్బందిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను  రాష్ట్రంలో 1వ స్థానంలో
తీసుకురావడానికి కృషి చేయాలని జిల్లా వైద్య అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ పీహెచ్‌సీ వైద్య సూపర్వైజర్ భోగా ప్రకాష్, వైద్య సిబ్బంది భగత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.