మధిర లో డిఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా పర్యటన విజయవంతం మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్స

Published: Wednesday December 14, 2022

విజయవంతమై మధిర రైల్వే నిలయం తనిఖీకి వచ్చిన సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ అజయ్ కుమార్ గుప్తా పర్యటన మధిరలో ముగిసింది. విజయవాడ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన డిఆర్ఎం తొలుత రైల్వే స్టేషన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్ బాల్ కోర్టును చిల్డ్రన్స్ పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు అనంతరం స్టేషన్ను మొత్తం పరిశీలించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి దిగే దగ్గర ఎత్తుగా ఉండటంతో దాన్ని సరి చేయాలని సూసించారు. అదేవిధంగా ప్రయాణికులకు నిరంతరం తాగునీరు సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. తొలిసారిగా మధిరకు వచ్చిన డిఆర్ఎమ్ కు కాంగ్రెస్ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం మధిర సేవాసమితి వాసవి క్లబ్ సిమ్మర్స్ అసోసియేషన్ రైల్వే ప్రయాణికుల సంఘం ఆధ్వర్యంలో పలు వినతి పత్రాలను అందజేశారు ముఖ్యంగా మధిర రైల్వే స్టేషన్ లో నవజీవన్ నిలుపుదల చేయాలని తిరుపతి వెళ్లేందుకు మధిరలో పద్మావతి ఎక్స్ ప్రెస్ ఆగుతుంది. కానీ తిరుగు ప్రయాణంలో పద్మావతి మధిర లో ఆగడం లేదని, దీనివల్ల భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ఈ ట్రైన్ ని మధిరలో ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం విజయవాడ వెళ్లేందుకు ప్యాసింజర్ రైలను పునరుద్ధరించాలని వారి కోరారు, లక్నో ఎక్స్ ప్రెస్ రైలును మధిరలో ఆపాలని వారు కోరారు. మూడవ లైను కోసం రైల్వే అధికారులు ప్రైవేటు స్థలాల్లోకి వచ్చి ఇది మాస్తలం అంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు డిఆర్ఎం కి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా మధిర రైల్వే ఫ్లాట్ పారాలపై రైల్వే కోచ్ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్పి డి చటోపాధ్యాయ ఏడిఈఎన్ అరుణ్ కుమార్ శర్మ ఐఓడబ్ల్యూ శ్రీనివాసరావు సీనియర్ డిఈఎన్ కృష్ణారెడ్డి, ప్రసాద్ రావు, సజ్జ రాజకీయ పార్టీ నేతలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మిరియాల రమణ గుప్తా, బెజవాడ రవిబాబు, జంగా నర్సిరెడ్డి, పల్లపోతు ప్రసాదరావు, ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు, జెవిరెడ్డి, శీలం నరసింహారావు మిరియాల కాశీ విశ్వేశ్వరరావు షేక్ జహంగీర్ చల్లా సత్యం తదితరులు పాల్గొన్నారు