కరోనా బాధితులకు అల్పాహారం

Published: Wednesday June 02, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి : మధిర ప్రభుత్వ ఆస్పటల్ వద్దకు కరోన టెస్టుల కోసము వ్యాక్సిన్ కోసము ఉదయాన్నే వచ్చి లాక్ డౌన్ కారణంగా టిఫిన్ చేయడం ఇబ్బందిగా ఉన్న విషయాన్ని గమనించి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తేల వసంత య్య మెమోరియల్ స్కూల్ నందు అల్పాహారంఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్పాహారం కేంద్రాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ముందు జాగ్రత్త చర్యలు లేమి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. కరోనా కష్టకాలంలో కరోనా పేషెంట్లను కుటుంబ సభ్యులు సైతం దూరం పెడుతున్న సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారికి ఐసోలేషన్ క్యాంపులు మందులు భోజనం అల్పాహారంవంటివి అందించి పేద కుటుంబాలకు అండగా ఉంటున్నామని తెలియజేశారు. ఢిల్లీ నుండి గ్రామం వరకు సిపిఎం పార్టీ కార్యకర్తలు. కమిటీలు తమ శక్తి మేర ప్రజలకు అండగా ఉండి సేవలు అందిస్తున్నారని అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు మాత్రమే ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రణాళికలు రూపొందించి పనిచేస్తున్నాయని మిగతా పార్టీలు ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి సీలం నరసింహారావు రూరల్ కార్యదర్శి మందా సైదులు పార్టీ పట్టణ మండల నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ పడకండి మురళి మద్దాల ప్రభాకర్ వి మధు మండవ కృష్ణారావు ఓట్ల శంకర్రావు ఆవుల శ్రీనివాసరావు వనమా కృష్ణయ్య షేక్ ఉద్దండుసాహెబ్ దోర్నాల విజయ్ షేక్ సైదులు ఓట్ల అజయ్ షేక్ కాజా తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ల సౌకర్యార్థం అల్పాహార కేంద్రాన్ని కొద్దిరోజులపాటు కొనసాగిస్తామని తెలియజేశారు