జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములో సమీక్షా సమావేశం.. -- జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత

Published: Saturday August 27, 2022
జగిత్యాల, ఆగస్టు, 26 ( ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములో జిల్లా  పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అధ్యక్షతన జిల్లా లోని సమస్త మండల పరిషత్ అభివృద్ది అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం లో  డి.ఆర్.డి.ఓ. శ్రీ ఎస్.వినోద్ మరియు ఇంచార్జ్ డి.పి.ఓ. శ్రీ పి.నరేష్ లు హాజరైనారు. తెలంగాణ రాష్ట్రము లో ప్రతిష్టాకరంగా చేపట్టిన తెలంగాణాకు హరితాహారం కార్యక్రమములో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో ఇంటిటా ప్లాంటేషన్, ఎవెన్యు ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ మరియు మల్టీ లేయర్ ప్లాంటేషన్ నందు ఎలాంటి గ్యాపులు లేకుండా రాగల 10,15 రోజులలో పూర్తి స్థాయిలో ప్లాంటేషన్ చేపట్టాలని ఆదేశించినారు. ప్రభుత్వం ద్వారా మంజూరీ చేయ బడు చున్న అభివృద్ది పనుల మరియు సంక్షేమ పథకము లను అర్హత గల వారికి అమలు చేయాలని సమస్త మండల పరిషత్ అభివృద్ది అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశం లో  చైర్ పర్సన్ మాట్లాడుచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పేదవారికి వివిధ కేటగిరిల క్రింద ఆసరా పింఛనులు ఆగస్టు, 2022 మాసము నుండి నూతనముగా మంజురిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పేద ప్రజల పట్ల  మాట్లాడుచూ ముఖ్యమంత్రి  కి గల దాతృత్వాన్ని జిల్లా ప్రజా పరిషత్ తరపున జిల్లా పరిషత్ చైర్ పర్సన్  దావ వసంత సురేష్ ధన్యవాదములు తెలియ జేసినారు.