సమైక్యత వజ్రోత్సవాల విజయవంతం చేయాలి అధికారులు మధిర రూరల్

Published: Wednesday September 14, 2022
సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశం
 సీఐ మధిర కార్యాలయంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఆర్డీవో ఖమ్మం మరియు సీఐ.మధిర ,ఎంపీడీవో ,ఎమ్మార్వో మధిర మరియు మధిర నియోజకవర్గం యస్.ఐ లు మున్సిపల్ కమిషనర్, ఏఈ ఎలక్ట్రికల్, ఏడి మార్కెటింగ్ శాఖ , ఫైర్ డిపార్ట్మెంట్ వారితో ఈనెల 16వ తారీఖున జరిగే జాతీయ సమైక్యత ర్యాలీ గురించి మరియు అదేవిధంగా ఏఎంసీ మార్కెట్ యార్డులో జరగనున్న మీటింగ్ వస్తు ఏర్పాట్ల గురించి మరియు దాని తర్వాత జరిగే భోజన కార్యక్రమాల గురించి తగు సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగినది.అనంతరం ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ
సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా  నిర్వహించాలిఅడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ బోస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16 17 18 తేదీల్లో నిర్వహిస్తున్న సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వారు తెలిపారు ఖమ్మం డిసిపి లా అండ్ ఆర్డర్ ఏసీపీ బోస్ పేర్కొన్నారు. సమైక్యత వారోత్సవాల్లో భాగంగా 16వ తేదీన నిర్వహించే ర్యాలీపై తీసుకోవలసిన చర్యల గురించి ఆయన వివరించారు. అనంతరం సమైక్యత వజ్రోత్సవాలపై మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కాజీ పురంలో రూరల్ పోలీస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట వైరా ఏసిపి రెహమాన్ సీఐ మురళి తహసిల్దార్ రాంబాబు ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ రమాదేవి టౌన్ రూరల్ ఎస్సైలు సతీష్ కుమార్ నరేష్ పాల్గొన్నారు