తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి

Published: Thursday November 25, 2021

రాయికల్, నవంబరు 24 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బుధవారం రోజున రాయికల్ - ఇటిక్యాల రహదారి పై గ్రామ రైతులు దాదాపు 200 మంది కి పైగా ధర్నా చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, రోజులు గడుస్తున్నా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని, మిల్లర్ల తాలు తప్ప నూక పేరిట కటింగ్ చేయడం పై నిరసన వ్యక్తం చేసారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న రాయికల్ తహసీల్దార్ కు౦దారపు మహేశ్వర్ రైతులకు నచ్చచెప్పి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమి౦ప జేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలుగకుండా పోలీసులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఏలేటి జలంధర్ రెడ్డి, ఎల్లాల శేఖర్, మహిపతి రెడ్డి, విజయ్, సత్యం, జీవన్ గడ్డం రాజేందర్, నరసింహ రెడ్డి, రమేష్, రాజారెడ్డి, నర్సారెడ్డి, హన్మన్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.