కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో "అయ్యప్ప మహా పడిపూజ" ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Monday December 26, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 25 (ప్రజాపాలన,ప్రతినిధి) :
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్  రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం "అయ్యప్ప మహా పడి పూజను ఘనంగా నిర్వహించారు". ఈ కార్యక్రమానికి  అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరై,స్వామి వారికి ఎంతో వైభోపేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు,భక్తులు. అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప నామస్మరణం,భజన పాటలు,భక్తి గీతాలను ఆలపించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు,ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ చాహాత్ వాజ్పాయ్,,సిర్పూర్ ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప, దంపతులు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు,  ప్రజాప్రతినిధులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.