రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే సహించం

Published: Thursday February 03, 2022
కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. వికారాబాద్ బిఎస్పి నాయకులు
వికారాబాద్ బ్యూరో 02 ఫిబ్రవరి ప్రజాపాలన :  భారత రాజ్యాంగ బద్దంగా ఎన్నికై ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం సిగ్గుచేటని వికారాబాద్ బిఎస్పి నాయకులు వికారాబాద్ ఇంచార్జ్ యాదయ్య, కోటపల్లి మండల ఇంచార్జ్ ఇంటెనుక అరుణ్, మర్పల్లి మండల ఇంచార్జ్ సన్నీ ఘాటుగా విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో అసెంబ్లీ అధ్యక్షుడు క్రాంతికుమార్, అసెంబ్లీ ఇంచార్జ్ పెద్ది అంజయ్యల ఆదేశాల మేరకు అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ సమక్షంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ కూడలిలో సిఎం కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ ని నాదాల భేరీ మోగించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు మాట్లాడుతూ సిఎం కేసీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనడం అమానుషమని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా భారత రాజ్యాంగం ఇప్పటికీ ముందస్తుగానే ఉందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 పొందుపర్చినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందుకే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వయ్యావని దెప్పి పొడిచారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ వలన ఈ రోజు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించి దేశానికి దశ దిశ నిర్దేశించారని  పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన కొంతమంది స్వార్థపరులు రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం శోచనీయమన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు చూస్తుంటే అగ్రవర్ణ భావజాలంతో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ తప్పు తెలుసుకుని భారత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బిఎస్పి నాయకులు తదితరుల పాల్గొన్నారు.