కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

Published: Monday November 21, 2022
బోనకల్, నవంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట గ్రామం కల్వరి టెంపుల్ పాస్టర్ సుంకర ఏసుబాబు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో గుండె ఆపరేషన్ చేయించుకున్న యంగల శ్రీను కి ఆదివారం నిత్యవసర సరుకులు,పండ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫాస్టర్ సుంకర యేసు బాబు మాట్లాడుతూ యంగల శ్రీను ఏసుప్రభు ఆశీర్వాదాలతో త్వరగా కోలుకోవాలని ప్రభువును వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సహాయ సేవకులు యాకోబు, బందెల ముత్తయ్య తోటపల్లి ఏసు, నారపోగు ముక్కంటి, ఏసు కటికల శ్యాంబాబు వేము కిషోర్ యూత్ సభ్యులు ,సంఘస్తులు వారు పాల్గొన్నారు.