తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం

Published: Monday September 13, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలంలోని చిరునోముల గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు, తామ్ర పత్రం గ్రహీత రావెళ్ల జానకిరామయ్య స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు ప్రారంభించారు. రామాంజనేయులు మాట్లాడుతూ నైజాం కాలంలో తెలంగాణలో రజాకార్ల దాష్టికం, భూమి కోసం, భుక్తి కోసం కమ్యూనిస్టులు పోరాడిన తీరుపై ఆయన మాట్లాడారు. సాయుధ తెలంగాణ పోరాట స్ఫూర్తిగా ప్రజలు, కమ్యూనిస్టులు ఏకమై సాగి హక్కులను సాధించుకోవాలని ఈ సందర్భంగా రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉద్యమ కేంద్రమైన గోవిందాపురం (ఎల్) గ్రామంలో సెప్టెంబర్ 16న  తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను స్పూర్తితో నిర్వహిస్తున్న మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, సీపీఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, మాతంగి శ్రీనివాస్ రావు, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, ఎస్ అమర్నాథ్, ఆకెన పవన్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.