రాయికల్ బస్టాప్ లో మౌలిక వసతులులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Published: Tuesday June 28, 2022
రాయికల్ జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి ):
రాయికల్ మునిసిపల్ పరిధిలో  బస్టాప్ లో ప్రయాణికులకు  మరుగుదొడ్లు ఇతర సదుపాయాలులేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టూపక్కల 4 మండలాల  నుండి ప్రతిరోజు కొన్ని వేల మంది రాయికల్ ను సందర్శిస్తారు, అలాంటి బస్టాప్ లో ఇలా అరకొర వసతులతో ఉండటం వలన ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇకనైనా అధికారులు మేల్కొని బస్టాప్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయగలరని ప్రయాణికులు విన్నవించుకుంటున్నారు.