ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంకల్పం గొప్పది : మంత్రి కేటీఆర్

Published: Tuesday April 06, 2021
కూకట్పల్లి, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : సోమవారం కూకట్పల్లి నియోజకవర్గం లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి... ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ..ఎమ్మెల్సీ నవీన్ రావు, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి... పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా భరత్ నగర్ ఫ్లైఓవర్ నుండి మంత్రి కేటీఆర్ కార్యకర్తలతో బయలుదేరి జే ఎం ఎం ఆర్ ఎం కాలనీలో రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంత్రి కేటీఆర్ గారి దృష్టికి కాలనీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను మరియు వర్షం వచ్చినప్పుడు వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు... వెంటనే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంకల్పం గొప్పదని నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి నిత్యం పోరాడుతూ అందుకు కావలసిన నిధులు ప్రభుత్వం నుండి సమకూర్చే విధంగా ముందుకు నడుస్తున్నారని తెలిపారు తెలిపినట్లు ఇక్కడున్న డ్రైనేజ్ రోడ్లు మరియు డంపింగ్ యార్డ్ సంబంధించి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ... వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని అక్కడికక్కడే జోనల్ కమిషనర్ మమత కి ఆదేశాలు జారీ చేశారు... ఈ సందర్భంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు... అనంతరం కెపిహెచ్బి 4 ఫేస్ లో నిరుపేదల కొరకు 4 కోట్ల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించి...అక్కడ నుంచి నేరుగా ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కలిగించే విధంగా దాదాపు 70 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభించారు. అనంతరం నగరంలోని మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులు కు 500 గజాల స్థలం కేటాయించి 45 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం ఉండదని. ముఖ్యమంత్రి కేసీఆర్  మంత్రి కేటీఆర్  ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు