ధారూర్ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా మహమ్మద్ ఇస్మాయిల్ ఎన్నిక

Published: Thursday September 30, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజాపాలన : టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డెగావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ధారూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షునిగా మహమ్మద్ ఇస్మాయిల్ ఏకగ్రీవంగా ఎన్నకైనందున ఎమ్మెల్యే పూలమాలాంకృతం చేసి సత్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధారూర్ మండలంలోనే టిఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని కోరారు. ప్రతి కార్యకర్తను సమన్వయ పరుస్తూ చైతన్యవంతం చేయాలని సూచించారు. పార్టీ శ్రేయస్సే ప్రథమ లక్ష్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ధారూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షునిగా నియామకమైన మహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. మైనారిటీ సామాజిక వర్గం అంతా టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడేటట్లు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మైనారిటీల శ్రేయస్సు కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను పూసగుచ్చినట్లు వివరించి చైతన్యం చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెల్యే కు సరస్వతీ మాత చిత్రపటం అందజేసి శుభాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధారూర్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య, ఏఎంసి చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా, మండల రైతుబంధు అధ్యక్షుడు రుద్రారం వెంకటయ్య ముదిరాజ్, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసి మాజీ చైర్మన్ రాములు, ఏఎంసి ఉపాధ్యక్షుడు రాజుగుప్తా, వైస్ ఎంపిపి విజయ్ నాయక్, జనార్ధన్ రెడ్డి, లక్ష్మయ్య, మోహన్ రెడ్డి, ఫాజిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.