ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు : తాండూర్ సి.ఐ బాబురావు

Published: Tuesday June 29, 2021

బెల్లం పల్లి, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావు తెలిపారు. సోమవారం నాడు తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఐబీ చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేనియెడల వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క వాహనానికి నెంబర్ ప్లేటు తప్పనిసరిగా ఉండాలని నెంబర్ ప్లేట్ లేకపోవడంతో వాహనానికి ప్రమాదం జరిగినప్పుడు లేదా దొంగలించ పడినప్పుడు గుర్తించుట ఇబ్బందికరంగా మారుతుందనీ వాహనానికి చలానా విధిస్తున్నారని చాలామంది నంబర్ ప్లేట్లను కనబడకుండా ఏర్పాటు చేసుకోవడం మరికొంతమంది నంబర్ ప్లేట్లను అమర్చక పోవడం చట్టరీత్యా నేరమన్నారు, వాహనాల తనిఖీ సమయంలో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని ఎవరైనా చూపించనీ ఎడల వారికి జరిమానా విధించడం తప్పదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ,కాలుష్య నివారణ పత్రంతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని హెల్మెట్ తప్పనిసరిగా దరించాలని నాలుగు చక్రాలు ఆ పై భారీ వాహనాలు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా నడప రాదని తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు, మద్యం మత్తులో వాహనం నడపరాదని డ్రంక్ అండ్ డ్రైవ్ పరిశీలనలో మద్యం సేవించి పట్టుబడినట్లు అయితే వారి పైన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సోమవారం నాడు చేసిన తనిఖీల్లో సుమారు 20కి పైగా వాహనాలకు నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మొదటిసారిగా జరిమానా విధించి వదిలివేయడం జరిగిందని మళ్లీ తనిఖీ సమయంలో ఇలా పట్టుబడితే వాహనాన్ని జప్తు చేసి కోర్టుకు పంపడం జరుగుతుందన్నారు, వాహనం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ నంబర్ ప్లేట్ ను కనబడే విధంగా అమర్చుకోవాలని నంబర్ ప్లేట్ కూడా కలిగి ఉండాలని అదేవిధంగా ప్లేట్ పై ఏలాంటి అసభ్యకరమైన చిత్రాలతో పాటు ఇతరత్రా రాతలు ఉండకూడదన్నారు, ప్రతి ఒక్క వాహనదారుడు పై ట్రాఫిక్ సూచనలు తప్పకుండా పాటించాలని లేనియెడల ఎంతటివారినైనా ఉపేక్షించబోమని  శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శాంతి భద్రతల విషయంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు రావు తో పాటు ఎస్సై కిరణ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.