ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం... తెలంగాణ రాష్ట్

Published: Saturday September 24, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 40 లక్షల రూపాయలు పనులు, సీతారాంపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో 46 లక్షల రూపాయలు పనులను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ.
మన గ్రామాలలో ఉన్న పాఠశాలలు ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు గ్రామస్తులు, భాగ్యస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించి పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితో అత్యంత ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు, ఈ కార్యక్రమాన్ని ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిల విద్యను అందిస్తున్నట్లు తెలిపారు, పాఠశాలలో ప్రధానంగా 12 మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు, గౌరవ సీఎం కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు, అన్ని విధాలుగా ప్రోత్సాహాలు, సహాయ సాకారాలు అందిస్తున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వమని అన్నారు, అంతకు ముందున్న ప్రభుత్వాలు విద్యావ్యవస్థను పట్టించుకున్న దాఖలాలు లేవు, సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.