ఏప్రిల్ 9 న ఐ ఐ సి టి ఆడిటోరియంలో హోమియోపతి జాతీయ సదస్సు... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Saturday April 08, 2023
ప్రజల్లో హోమియో పతి వైద్య విధానం పట్ల అవగాహన పెంచడానికి ఏప్రిల్ 9 న ఐ ఐ సి టి ఆడిటోరియంలో హోమియోపతి జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు గ్లోబల్  హోమియోపతి ఫౌండేషన్ చైర్మన్ జయేష్ వి సాంగ్వి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను డాక్టర్లు ఎస్ ప్రవీణ్ కుమార్, సతీష్,  శ్రీ వాల్స్ మీనన్ లతో కలిసి  ఆవిష్కరించారు.  గవర్నర్ తమిళి సై ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 350 మంది హోమియోపతి వైద్యులు సదస్సులో పాల్గొంటారని తెలిపారు. హోమియోపతి వైద్య విధానం పుట్టుక మానవాళికి హోమియోపతి వైద్యం చేసిన సేవలు సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి విశిష్టత అనే విషయాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి  సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధిని నయం చేస్తుందని చెప్పారు.